పెద్దితోనే ఇరుముడి ఫస్ట్ గ్లిమ్స్‌?

May 20, 2026


img

రామ్‌ చరణ్‌ హీరోగా 'పెద్ది' చాలా భారీ అంచనాలతో జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమాకున్న క్రేజ్‌ని మాస్ మహారాజ్ రవితేజ కూడా వాడేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.     

శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరుముడి’ ఫస్ట్ గ్లిమ్స్‌ త్వరలో ఏదో రోజు విడుదల చేయాల్సిందే. అదేదో జూన్‌ 4న పెద్దితో బాటు థియేటర్లలో విడుదల చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవునో కాదో త్వరలోనే తెలుస్తుంది.    

ఇరుముడి తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామా అని ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్న జీవీ. ప్రకాష్ కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఫస్ట్ గ్లిమ్స్‌ తర్వాత వరుసగా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ విడుదల కానున్నాయి.       

ఈ సినిమాలో రవితేజకు భార్య కావేరీగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష