రమణీ కల్యాణం ట్రైలర్‌.. చూశారా?

May 20, 2026


img

విజయ్‌ ఆదిరెడ్డి దర్శకత్వంలో సూర్య వశిష్ట, దీపశిఖ చంద్రన్ జంటగా నటించిన ‘రమణీ కల్యాణం’ ఈ నెల 22న విడుదల కాబోతోంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నందున ఇటీవలే టీజర్‌ విడుదల చేశారు. అద్భుతంగా ఉంది. నేడు ట్రైలర్‌ విడుదల చేశారు. అది కూడా యువతని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా చాలా బాగుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ అందమైన తెలివితేటలున్న అమ్మాయే కానీ అంధురాలు.. హీరో కూడా అందగాడే... కానీ చక్రాల కుర్చీకే పరిమితం. 

వారిద్దరూ ప్రేమలో పడి పెళ్ళి వరకు వెళ్తే అదే రమణీ కల్యాణం అని టీజర్‌లో... ఇప్పుడు ట్రైలర్‌లో మరోసారి  చూపారు. 

ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, చైతు జొన్నల గడ్డ, శ్యామల, ప్రభావతి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విజయ్‌ ఆదిరెడ్డి, సంగీతం: సూరజ్ ఎస్ కురూప్, కెమెరా: అరవింద్ తిరుకోవెల, డైలాగ్స్: రామ్‌ జగదీశ్, పాటలు: పూర్ణాచారి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేశారు.   

కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి నిర్మించిన రమణీ కల్యాణం ఈ నెల 22న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష