పెద్ది కా ఆవాజ్... భోపాల్‌లో!

May 23, 2026


img

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పెద్ది’ జూన్‌ 4న విడుదల కాబోతోంది. ఈ సినిమా హిందీలో కూడా విడుదల చేస్తున్నందున ఉత్తరాదిన కూడా పెద్ది ప్రమోషన్స్ తప్పనిసరి. ఈరోజు (శనివారం) సాయంత్రం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘పెద్ది కా ఆవాజ్’ పేరుతో ఏఆర్ రహమాన్ సంగీత కచేరి నిర్వహించబోతున్నారు. దీనిలో పెద్ది సినిమాలో రెండు హిందీ పాటలు ఏఆర్ రహమాన్ బృందం పాడబోతున్నారు. ఈ కార్యక్రమంలోనే పెద్ది వీడియో ఐటెం సాంగ్‌ కూడా విడుదల చేస్తారు. 

భోపాల్‌లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన బీహెచ్ఈఎల్ దసరా మైదాన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ‘పెద్ది కా అవాజ్’ వేడుక మొదలవుతుంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం జరుగబోతున్న దసరా మైదాన్‌, నగరంలోని ప్రధాన కూడళ్ళలో పెద్ది పోస్టర్స్, కటవుట్స్ పెట్టారు. అప్పుడే వేలాదిగా యువతీయువకులు అక్కడకు చేరుకుంటున్నారు. 

ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో https://www.youtube.com/live/fLpxHYnehUk లింక్ ద్వారా లైవ్ కూడా చూడవచ్చు.            

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/fLpxHYnehUk?si=wLdO2NosO4I1GI2z" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష