రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా చేస్తున్న ‘రౌడీ జనార్ధన’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడని ముందు ప్రకటించినా ఇప్పుడు మరో సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా కూడా ‘రౌడీ జనార్ధన’ టీమ్‌లో చేరినట్లు తెలుస్తోంది.
క్రిస్టో జేవియర్ కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే, విశాల్ మిశ్రా పాటలకు సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ తమ టాలెంట్ నిరూపించుకున్నవారే. కనుక ఇలాంటి యాక్షన్ చిత్రానికి ఇద్దరూ సంగీత దర్శకులు అందించబోయే సంగీతంతో రౌడీ జనార్ధన మరింత గొప్పగా మారుతుందని భావించవచ్చు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవికిరణ్ కోలా, అడిషనల్ స్క్రీన్ ప్లే: జనార్ధన పసుమర్తి, సంగీతం: క్రిస్టో జేవియర్, కెమెరా: ఆనెంద్ సి చంద్రన్, స్టంట్స్:సుప్రీం సుండ, ఆర్ట్: సత్యనారాయణ డివై చేశారు.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కాబోతోంది.