వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగబోతున్నాయి. వాటి ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే రూ. కోట్లు మంజూరు చేసింది. తాజాగా నేడు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లకు అదనంగా మరో వెయ్యి కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేశారు.
నేటి సమావేశంలో జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్నం భోజన పధకం అమలుకి ఆమోదం తెలిపారు. జూనియర్ కాలేజీలలో ఉదయం అల్పాహారం, పాలు కూడా అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కరీంనగర్‌లో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేసముద్రం అగ్నిమాపకకార్యాలయానికి కొత్తగా 18 పోస్టులు మంజూరు చేశారు.