జగిత్యాల జిల్లాలోని రుద్రంగి, కొడిమ్యాల మండలాలలో గత 20 రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఇటీవల ఆ ప్రాంతాలలో రెండు ఆవులను, ఒక దూడని పెద్దపులి చంపింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఇళ్ళలో నుంచి బయటకు రావడానికే చాలా భయపడుతున్నారు.
జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది కూడా పెద్దపులిని పట్టుకునేందుకే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. అది బోనులో చిక్కడం లేదు కానీ సీసీ కెమెరాలకు చిక్కుతోంది.
శనివారం ఉదయం రుద్రంగి, కొడిమ్యాల మండలాల వద్ద అటవీప్రాంతంలో పెద్దపులి కనబడింది. సాధారణంగా చుట్టుపక్కల గ్రామస్తులు ఆ అడవి మార్గం గుండానే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది కనుక గ్రామస్తులు ఎవరూ అడవి మార్గంలో కొండగట్టుకి వెళ్ళవద్దని అటవీశాఖ అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం.. వీడియో దృశ్యాలు

రుద్రంగి, కొడిమ్యాల మండలాల్లో పులి సంచారం

ఇరవై రోజుల క్రితం ఆవులను చంపి తిన్న పెద్దపులి

అటవీ మార్గంలో భక్తులు కొండగట్టుకు వెళ్లొద్దని ప్రచారం

సోషల్ మీడియాలో వైరల్ అయిన పులి సంచారం వీడియో

Tiger Sighting in Jagtial… pic.twitter.com/B2FFG1wWS3
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2026