గత ఏడాది మే 7-10 తేదీల మద్య భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌పై చేసిన దాడులనే ఆ దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఆలోగా రణవీర్ కపూర్ ప్రధాన పాత్రలో ‘ధురందర్’ అది హిట్ అవడంతో సీక్వెల్‌గా దురంధర్-2 విడుదలైంది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ధురంధర్ సినిమాలో ఓ భారతీయ గూడచారి పాకిస్తాన్‌లో ఏవిధంగా విధ్వంసం సృష్టించారో చూపించారు.
‘ఆపరేషన్ సిందూర్’ అయిన గాయమే ఇంకా మరిచిపోలేకపోతున్న పాకిస్తానీలు ఈ దురంధర్-1,2 లను కూడా చూశారు. ఈ సినిమా వారిని కూడా కట్టిపడేసింది. కానీ దానిలో పాకిస్తాన్ తలదించుకునేలా ఉండటంతో చాలా మంది ఆగ్రహం, ఆవేశం, అసహనానికి లోనవుతున్నారు.
దురంధర్-1,2లు ఏమాత్రం బాగోలేవని కామెంట్స్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్‌లో కూడా దురంధర్ సూపర్ హిట్ అవడమే విశేషం.
ఇప్పుడు . దురంధర్-1,2ల షాక్ నుంచి వారు తేరుకోక ముందే కాశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాతలు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ కలిసి ‘ఆపరేషన్ సింధూ’ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. కనుక పాకిస్తాన్ మీద మిలటరీ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇలా వరుసపెట్టి ‘సినీ ఆపరేషన్స్’ కూడా జరుగుతుండటం, వాటిని కూడా పాకిస్తానీలు ఆస్వాదిస్తుండటం విశేషమే కదా?