అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ మెరుపు దాడి!

March 26, 2026
img

ఓ పక్క ఇరాన్‌తో యుద్ధం కొలిక్కి వచ్చిందని, ప్రస్తుతం శాంతి చర్చలు సాగుతున్నాయని, ఇరాన్‌ తమ షరతులన్నిటికీ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ గొప్పలు చెప్పుకుంటుంటే, అమెరికా నావికాదళంతో అత్యంత శక్తివంతమైన విమాన వాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ మెరుపు దాడి చేసింది. ఇరాన్‌ శక్తివంతమైన ఖాదర్ క్షిపణులతో అబ్రహం లింకన్‌ యుద్ధనౌక మీద దాడి చేసింది.

ఇరాన్‌ ఇది వరకు కూడా దానిపై దాడి చేసినట్లు చెప్పుకుంది. కానీ వీడియో రిలీజ్ చేయలేదు. కానీ ఈసారి వీడియో విడుదల చేసింది. దానిలో క్షిపణి దాడికి గురైన అమెరికా యుద్ధనౌక స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకవేళ ఈ వీడియో నిజమే అయితే దానిపై డజన్ల కొద్దీ అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ధ్వంసం అయ్యే ఉంటాయి. ఈ దాడిలో అబ్రహం లింకన్‌ పూర్తిగా ధ్వంసం అయ్యిందా లేక పాక్షికంగా దెబ్బ తిందా? ఈ దాడిని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు. ఇరాన్‌ విడుదల చేసిన ఈ వీడియోని ఖండించలేదు కూడా. కనుక ఈ వీడియో వాస్తవమా లేదా ఏఐతో స్రుష్టించిందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

Video Source: Big TV Breaking News

Related Post