అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో ‘నాగ బంధం’ సిద్దమవుతోంది. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ, జయ ప్రకాష్, మహేష్ మంజ్రేకర్, బిస్ అవినాష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఇటీవల నాగబందం టీజర్, ‘నమో రే...’ అంటూ సాగే ఓ పాట విడుదల చేయగా రెండూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా, సంగీతం: జునైద్ కుమార్, అభి, కెమెరా: సౌందర్ రాజన్, డైలాగ్స్: కళ్యాన్ చక్రవర్తి, స్టంట్స్: కనాల్ కన్నన్, వ్లాడ్ రింబర్గ్ (అమెరికా), రియల్ సతీష్, ఎడిటింగ్: ఆర్ సి ప్రణవ్,కొరియోగ్రఫీ: బ్రిందా, గణేష్ ఆచార్య, శ్రస్టి వర్మ చేశారు.
ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 3న నాగ బంధం విడుదల చేయబోతున్నట్లు రిలీజ్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.