వెంకీ-త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న?

March 26, 2026


img

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47-ఏకే 47’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్‌ పూర్తయింది. మిగిలినది కూడా మే నెలాఖరులోగా పూర్తిచేసి అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 క్రైమ్ ఫ్యామిలీ డ్రామా గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష