అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచి చిచ్చుబుడ్డి సాంగ్ ప్రమో వదిలారు. ఐటెం సాంగ్‌లా ఉన్న ఈ పాటకు జోనిట డాన్స్ చేసిందని తెలియజేస్తూ రెండు సెకన్లు మాత్రమే చూపారు. పూర్తి పాట శనివారం విడుదల కాబోతోంది.
భాస్కరభట్ల రవికుమార్ వ్రాసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించగా రామ్ మిరియాల, జోనిట గాంధీ కలిసి పాడారు.
షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: అడవి శేష్, షనీల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ధనుష్ భాస్కర్, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్, యాక్షన్: ఏ విజయ్ చేస్తున్నారు.
డెకాయిట్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.