మానస శర్మ దర్శకత్వంలో యువ హీరో సంగీత్ శోభన్, నయన సారిక జంటగా చేసిన ‘రాకాస’ ట్రైలర్ విడుదలైంది. ఫాంటసీ, హర్రర్ మిక్స్ చేయడం సులువే కానీ దానిలో కామెడీని కూడా మిక్స్ చేయడమే చాలా కష్టం. రాకాస ట్రైలర్‌లో ఆ మూడింటిని చక్కగా మిక్స్ చేసి వదిలారు. అందుకే ట్రైలర్‌ని పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్విందర్ సింగ్, వాసు ఇంటూరి, రహిని, రోహాన్ రాయ్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మానస శర్మ, సంగీతం:అనుదీప్ దేవ్, కెమెరా:ఎదురోల్లు రాజు, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల, ఎడిటింగ్: అన్వర్ అలీ చేశారు.
నిహారికా కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి పింక్ ఎలీఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాకాస నిర్మించిన రాకాస ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.