బుచ్చిబాబు సనా- రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఏప్రిల్ 30న వస్తున్న ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొన్న ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు రామ్ చరణ్‌కి స్వల్ప గాయమైంది. ఎడమ కంటికి చిన్న దెబ్బ తగలడంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని వెంటనే చికిత్స పొందారు. దీంతో సోషల్ మీడియాలో పుకార్లు, ఊహాగానాలు మొదలైపోయాయి.
రామ్ చరణ్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు కనుక షూటింగ్ నిలిచిపోయిందని, ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ కావడం కష్టమంటూ పుకార్లు మొదలైపోయాయి.
వీటిపై ఈ సినిమా నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సోషల్ మీడియాలో ఓ ప్రకటన జారీ చేశాయి. రామ్ చరణ్ ఎడమ కంటికి చిన్న దెబ్బ తగిలిన మాట వాస్తవం. కానీ వెంటనే చికిత్స తీసుకున్నారు. నేటి నుంచి మళ్ళీ షూటింగ్‌కి హాజరవుతారు. సినిమా షూటింగ్‌లో ఎటువంటి గ్యాప్ రాలేదు. సాఫీగా షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదు. ఆయన బాగానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు,” అంటూ ప్రకటన విడుదల చేసింది.
చెప్పిన సమయానికే సినిమా టి గాయం కాలేదు కనుక ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. కనుక అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
రేపు (శ్రీరామ నవమి) రామ్ చరణ్ పుట్టిన రోజు.. కనుక ఈ సందర్భంగా పెద్ది టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.