జీవన్ రెడ్డి కార్యాచరణ: సిఎం రేవంత్ రెడ్డిపై పోరాటమే!
Jeevan Reddy after quitting Congress party today made it clear he will start fighting against CM Revanth Reddy.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జగిత్యాలలో అనుచరులతో మాట్లాడుతూ, “నలబై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా వెంట నిలిచి ఒంటరిగానే పోరాడాను. కానీ గత రెండేళ్ళుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు చూసి తీవ్ర మనోవేదనతో పార్టీని వీడుతున్నాని చెప్పారు. ఈ విషయాలన్నీ రాజీనామా లేఖలోనే పేర్కొన్నారు. సభలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. పార్టీలో అందరినీ అణచివేస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయి గులాముగా బ్రతకడం కంటే ఎదురు తిరిగి పోరాడితే పోయేదేముంది? అందరం కలిసి పోరాడుదామా వద్దా? అని జీవన్ రెడ్డి అనుచరులను అడిగారు. అంటే ఇక నుంచి సిఎం రేవంత్ రెడ్డితో పోరాటాలు మొదలుపెట్టబోతున్నారన్న మాట! అయితే ఇందుకు వేరే ఏదో ఓ పార్టీ అండదండలు చాలా అవసరం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కాంగ్రెస్ నేతలున్నారు. కనుక అయన బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా

నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది

రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి https://t.co/xvzzqX3CCY pic.twitter.com/YMZ2gnsdza
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026