బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు రామ్ చరణ్‌కి స్వల్ప గాయమైంది. కంటి దగ్గర చిన్న దెబ్బ తగలడంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కంటికి ఎటువంటి గాయం కాలేదు కనుక ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. కనుక అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.