కిరణ్ అబ్బవరం సినిమా పేరు: తిమ్మరాజుపల్లి టీవీ

March 22, 2026


img

యువ నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా తీసిన సినిమా పేరు తిమ్మరాజుపల్లి టీవీ. నూతన దర్శకుడు వి. మునిరాజు దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో కెమెరా మ్యాన్ సాయి తేజ హీరోగా చేశారు. అతనికి జోడీగా వేద జలందర్ (వేదశ్రీ నటించింది. 

చాలా తక్కువ బడ్జెట్‌లో తెలంగాణ నేపధ్యంతో తీసిన ఈ సినిమాలో నటీనటులు దాదాపు అందరూ కొత్తవారే. ప్రదీప్ కొట్టే, స్వాతి కరీంరెడ్డి, అమ్మ రమేష్, వడ్డాది సత్యనారాయణ, తేజ విహాన్, టీవీ రామన్, మాధవి ప్రసాద్, చిట్టిబాబు, అన్షుమన్, లతీష్ కీలపట్టు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం: వి.మునిరాజు, సంగీతం: వంశీకాంత్ రేఖన, కెమెరా: అక్షయ రామ్‌ పోడిశెట్టి, ఆర్ట్: సుదీర్ మాచెర్ల చేశారు. 

కేఎ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ అబ్బవరం, తేజేశ్వర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 17న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష