మంత్రి అజారుద్దీన్ పరిస్థితి ఏమిటో?

March 20, 2026


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని మహ్మద్ అజారుద్దీన్ ఆరాటపడుతున్నప్పుడు, సిఎం రేవంత్‌ రెడ్డి అయనకి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు సిఫార్సు చేసి, మంత్రి పదవి కట్టబెట్టారు. ఇది జరిగి దాదాపు 5 నెలలవుతోంది. అయితే మంత్రి పదవి చేపట్టినవారు ఆరు నెలల్లోగా తప్పనిసరిగా శాసనసభ లేదా మండలిలో సభ్యులుగా ఎన్నికవ్వాలి. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. 

కనుక ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు అజారుద్దీన్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం మాజీ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మకి సిఫార్సు చేసింది. అయితే ఈ నియామాకలపై ఇదివరకు బీఆర్ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ కారణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇటీవల అయన మహారాష్ట్రకు బదిలీ కాగా అయన స్థానంలో శివ్ ప్రతాప్ శుక్లా గవర్నర్‌గా వచ్చారు. ఈ నియామాకాలపై అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక ప్రభుత్వం మళ్ళీ గవర్నర్‌తో మాట్లాడి ఏప్రిల్‌ నెలాఖరులోగా అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయించాల్సి ఉంటుంది. లేకుంటే రాజీనామా చేయకతప్పదు.      



Related Post