తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ నిర్మాణాల నియమ నిబంధనలు 2012 చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది. దాని ప్రకారం ఇకపై 21 మీటర్లు అంతకంటే ఎత్తైన భవనాలను ‘హైరైజ్ బిల్డింగులు’గా గుర్తిస్తారు. 750 చ.మీ నుంచి 2,000 చ.మీ లోపు స్థలంలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు భవనాలు నిర్మించాలంటే ఇకపై టీడీఆర్ తప్పనిసరి. హైరైజ్ భవనాలు కాని వాటికి టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్స్ విషయంలో సడలింపు లభిస్తుంది.
కేంద్ర గృహనిర్మాణ,పట్టణ వ్యవహరాల శాఖ 2016లో వీటి కోసం కొత్త చట్టాలు తెచ్చింది. వాటికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2012 భవన నిర్మాణ చట్టంలో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి, ఉన్నవాటిని కార్పోరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. అవుటర్ రింగ్ పరిధికి అవతల కూడా పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. కనుక హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో చాలా జిల్లాలలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగం అభివృద్ధి చెందుతోంది. ఈ నేపధ్యంలో భవన నిర్మాణ చట్టాలలో ఈ మార్పులు మరింత తోడ్పడతాయని అధికారులు చెప్తున్నారు.