కల్కి-2 షూటింగ్‌లో వాళ్ళిద్దరూ కూడా!

March 22, 2026


img

నాగ్ అశ్విన్‌ దర్శకత్వం ప్రభాస్‌ హీరోగా ‘కల్కి ఎడి2898’ సినీ పరిశ్రమ ఓ సరికొత్త ప్రయోగమనే చెప్పాలి. దానిని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించడంతో సూపర్ హిట్ అయ్యింది. అది తీస్తున్నప్పుడే సీక్వెల్‌ కూడా ఉంటుందని ప్రకటించారు. దానిలోనే సీక్వెల్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో  కల్కి-2 షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. జేడీ చక్రవర్తి, సల్మాన్ దుల్కర్ ఇద్దరూ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 

కల్కిమొదటి భాగంలో కీలక పాత్ర చేసిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే కల్కి-2కి రోజుకి 8 గంటలకు మించి పనిచేయలేనని స్పష్టం చేయడంతో ఆమెను తప్పించి ఆమె స్థానంలో ప్రియాంకా చోప్రాను తీసుకున్నారు. కల్కి ఎడి2898లో కీలక పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్ (అశ్వథామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్), సల్మాన్ దులక్ర్ (కెప్టెన్) మృణాల్ ఠాకూర్ (దివ్య) విజయ్‌ దేవరకొండ (అర్జునుడు), దిశా పటాని (రాక్సీ), సస్వత చటర్జీ (కమాండర్ మానస్), పశుపతి (వీరన్) తదితరులందరూ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.

కల్కి ఎడి2898 సూపర్ హిట్ అవడంతో ఈసారి రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష