ఉగాది పండుగ సందర్భంగా క్రేజీ కల్యాణం సినిమా నుంచి హీరో అఖిల్ రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ భాస్కర్, నరేష్, అఖిల్ ఉద్దెమారి ప్రధానపాత్రలు చేస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో చక్కటి ప్రేమ కథ, కామెడీ మిక్స్ చేసి ఈ సినిమా సిద్ధం చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: భద్రప్ప గాజుల, పాటలు: గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యాం, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: శ్యాం దూపాటి, కోరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని చేస్తున్నారు.
యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.