గోపీచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో గత ఏడాది నవంబర్లోనే కొబ్బరికాయ కొట్టి ఇటీవలే హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టారు. ప్రీ-ప్రొడక్షన్ పనుల వలన షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
గోపీచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కనుక చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు.