బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్ళేదేలే: కవిత

March 17, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ, భవిష్యత్‌లో ఏదో రోజు కేసీఆర్‌ ఆమెను వెనక్కి రమ్మని పిలుస్తారు.. అప్పటికి ఆమెకు కూడా పార్టీని భరించడం తన వల్ల కాదని అర్దమైపోతుంది కనుక గులాబీ గూటికి చేరుకోవడం ఖాయమనే అభిప్రాయలు వినబడుతున్నాయి.

తెలంగాణ రాజకీయ పార్టీలు, వాటి బలాబలాలు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వంటివన్నీ వాస్తవిక దృష్టితో చూస్తే కల్వకుంట్ల కవిత ఎక్కువ కాలం ఒంటరిగా రాజకీయాలలో సాగడం కష్టమే అనిపిస్తుంది. కనుక ఈ అభిప్రాయాలూ లేదా ఊహాగానాలు నిజమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తుంది. 

కానీ ఓ విలేఖరి ఇదే విషయం అమెను సూటిగా అడిగితే, “ఎట్టి పరిస్థితిలో నేను మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. మా తండ్రిగారు మరీ ఒత్తిడి చేస్తే ఆయననే వచ్చి మా పార్టీలో చేరమని కోరుతాను,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు. 

ఆమెకు ఇంత ఆత్మవిశ్వాసం ఉండటం అభినందనీయమే. కనుక ఇదే స్ఫూర్తితో పార్టీ ఏర్పాటు చేసుకొని ఎన్నికలలో గెలిపించుకోగలిగితే ఇక ఆమెకు, పార్టీకి తిరుగే ఉండదు.

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">అక్క 😂😂😂<a href="https://t.co/CpjeB30AYY">pic.twitter.com/CpjeB30AYY</a></p>&mdash; Palamuru Poru bidda (@palamurubidda) <a href="https://twitter.com/palamurubidda/status/2033527161613852725?ref_src=twsrc%5Etfw">March 16, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


Related Post