మల్లారెడ్డిని చూసి నేర్చుకోవాలి... డాన్సులు కాదు సంతోషంగా జీవించడం!

March 15, 2026


img

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత సరదాగా, హుషారుగా అందరికీ తెలిసిందే. నిన్న తమ 50వ పెళ్ళి రోజు సందర్భంగా మల్లారెడ్డి కాలేజీలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. దానిలో అయన చాలా ఉత్సాహంగా వేదికపై అందరితో కలిసి డాన్స్ చేశారు.

అదేదో అప్పటికప్పుడు చేసిన డాన్స్ కాదని, ముందుగా ఆ సినిమా పాటలకి రిహార్సల్స్ చేశారని చూస్తేనే అర్ధమవుతోంది.

వాటిలో ఇంకా హైలైట్ ఏమిటంటే, విజయ్‌ దేవరకొండ-రష్మికల సూపర్ హిట్ సినిమా ‘గీతా గోవిందం’లోని సూపర్ హిట్ సాంగ్ ‘తెల్లాతెల్లవారే వెలుగులా...’ పాటలో భార్య చుట్టూ తిరుగుతూ ఆయన చేసిన నటన, డాన్స్‌తో అందరినీ అలరించారు. 

ఆయన వయసు 70 ఏళ్ళు. ఈ వయసులో అనేక బాధ్యతలు, ఒత్తిళ్ళు, కాలేజీలు, కోర్టులు, కేసులు, రాజకీయాలు అన్నిటినీ బ్యాలన్స్ చేయడమే చాలా చాలా కష్టం. ఇన్ని టెన్షన్ల మద్య ఇలా సంతోషంగా సబురాలు జరుపుకోవడం మామూలు విషయం కానే కాదు కదా?

కేసీఆర్‌, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజేపి నేతలందరూ ఆయనలా సంతోషంగా, సరదాగా ఎందుకు జీవించలేకపోతున్నారు? ఎవరికీ వారు ఆలోచించుకోవాలి.

అలాగని సంతోషంగా ఉండటమంటే వేదికపై డాన్స్‌లు చేయడం మాత్రమే కాదు. సంతోషంగా జీవించగలిగినా సంతోషమే. సుఖంగా జీవించడం సంతోషంగా జీవించడానికి చాలా తేడా ఉంది. మల్లారెడ్డి సకల సౌకర్యాలతో సుఖంగాను జీవిస్తున్నారు. ఇలా సంతోషంగానూ జీవిస్తున్నారు.


Related Post