ట్రైలర్‌ వచ్చేసింది... ఉస్తాద్

March 14, 2026


img

హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ కోసం అభిమానులతో సహా విమర్శకులు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ట్రైలర్‌ వదిలారు.

పవన్ మార్క్ పంచ్ డైలాగులు, ఫైట్స్, డాన్సులు అభిమానులకు సరిపడేలానే ఉన్నాయి. కానీ కథ, స్క్రీన్ ప్లే ఆ స్థాయిలో ఉంటాయా లేవా అనే విషయం ఈ నెల 19న ఉస్తాద్ ప్రజల మధ్యకు వస్తే తెలుస్తుంది. 

ట్రైలర్‌ ముగింపులో కూడా పవన్ కళ్యాణ్‌ ‘ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది,’ అంటూ గ్యారెంటీ ఇచ్చారు. కనుక అభిమానులు హ్యాపీగా అదివారం సాయంత్రం హైదరాబాద్‌, యూసఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైపోతారు. 

ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్‌-హరీష్ శంకర్ సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, ప్రస్తుతానికి ఇదే పవన్ కళ్యాణ్‌ చివరి సినిమా కావడంతో దీనిపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, పార్ధిబన్, నవాబ్ షా, గౌతమి, చమ్మక్‌ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, రమేష్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నబకంత, పృధ్వీ చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి  నిర్మిస్తున్న‘ఉస్తాద్ భగత్ సింగ్‌ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష