తెలంగాణలో ఉస్తాద్ బుకింగ్స్ ఓపెన్!

March 17, 2026


img

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ఉగాది రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఏపీలో ‘ఉస్తాద్’ టికెట్ ఛార్జీలు పెంపు, స్పెషల్ షోలకి అక్కడి ప్రభుత్వం అనుమతించింది. కానీ తెలంగాణలో టికెట్ ఛార్జీలు పెంపు, స్పెషల్ షోల కోసం ‘ఉస్తాద్’ కోరలేదు. కనుక సాధారణ టికెట్ ఛార్జీలతోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. క్షణాలలో ఫస్ట్ డే ఫస్ట్ షోతో సహా ఆ రోజుకి అన్ని షోలకి టికెట్స్ బుకింగ్ అయిపోయాయి. కనుక తెలంగాణలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో పడుతుంది. 

అదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ సినిమా టికెట్స్ రేట్స్ పెంపు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్‌ బట్టి టికెట్ ఛార్జీలు పెంచితే దానిని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎవరినీ బలవంతంగా అధిక ధరకి టికెట్స్ కొని సినిమాలు చూడమని ఎవరూ ఒత్తిడి చేయడం లేదన్నారు. సినిమాపై అంత  ఆసక్తి, స్తోమతు ఉన్నవారే స్వచ్చందంగా వస్తుంటారని పవన్ కళ్యాణ్‌ అన్నారు. 

ఆయన చెప్పినట్లుగానే ఏపీలో టికెట్ ఛార్జీలు పెంచినా వెంటనే బుకింగ్స్ అయిపోయాయి. తెలంగాణలో టికెట్ ఛార్జీలు పెంచకపోయినా వెంటనే బుకింగ్స్ అయిపోయాయి కదా?   

ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్‌-హరీష్ శంకర్ సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, ప్రస్తుతానికి ఇదే పవన్ కళ్యాణ్‌ చివరి సినిమా కావడంతో దీనిపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, పార్ధిబన్, నవాబ్ షా, గౌతమి, చమ్మక్‌ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, రమేష్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నబకంత, పృధ్వీ చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి  నిర్మిస్తున్న‘ఉస్తాద్ భగత్ సింగ్‌ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  



Related Post

సినిమా స‌మీక్ష