సంగీత్ శోభన్.. రాకాసా నుంచి నేడు రెండో పాట

March 13, 2026


img

మానస శర్మ దర్శకత్వంలో యువహీరో సంగీత్ శోభన్, నయన సారిక జంటగా చేస్తున్న ‘రాకాస’ ఫాంటసీ-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి పదేపదే అంటూ సాగే రెండో పాట నేడు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్విందర్ సింగ్, వాసు ఇంటూరి, రహిని, రోహాన్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మానస శర్మ, సంగీతం:అనుదీప్ దేవ్, కెమెరా:ఎదురోల్లు రాజు, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల,  ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు. 

నిహారికా కొణిదెల, ఉమేష్ కుమార్‌ బన్సాల్ కలిసి పింక్ ఎలీఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాకాస నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 3న విడుదల కాబోతోంది.        


Related Post

సినిమా స‌మీక్ష