కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీ ప్లెక్స్

March 13, 2026


img

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హైదరాబాద్‌ కోకాపేటలో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీ ప్లెక్స్ ని గురువారం సిఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, ప్రపంచంలో ఇలాంటి అతిపెద్ద డల్బీ థియేటర్లు మూడే ఉన్నాయి. వాటిలో ఇదొకటి,” అని అన్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నట్లే సినీ పరిశ్రమని కూడా ప్రోత్సహిస్తోంది. మన హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి పెద్ద థియేటర్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. సాంకేతికంగా ఎంత గొప్ప సినిమాలు తీస్తున్నా వాటిని ప్రదర్శించేందుకు సరైన థియేటర్స్ లేకపోతే ఆ ఎఫెక్ట్ కనిపించదు. నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని. ఆ రోజుల్లో ఆయన సినిమాలు మొదటిరోజు చూసేందుకు లారీలో 100 కిమీ ప్రయాణించి కర్నూలు వెళ్ళి చూసేవాడిని. ఆయన సినిమాలంటే నాకు అంత ఇష్టం. 

ఆరోజుల్లోనే ఆయన అనేక ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు. ఒక్కో ఏడాదిలో ఆయన నటించిన సినిమాలు 15-16 విడుదలవుతుండేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమా పూర్తిచేయడానికే 4-5 ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌ పాన్ ఇండియా స్థాయికే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష