నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

March 17, 2026


img

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సివీ షణ్ముగం నేడు విల్లుపురంలో మహిళల భద్రత కోసం నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాడు అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. ఇప్పుడు సిఎం స్టాలిన్ మన కలలను తనతో పంచుకోమని చెపుతున్నారు. కనుక చెపుతున్నా... నాకు నయనతార కావాలి. తెచ్చి ఇస్తారా? ఆమెను పెళ్ళి చేసుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. వారి కలను స్టాలిన్ నెరవేర్చగలరా?” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నేతలు సైతం తప్పు పడుతున్నారు. అధికార  డీఎంకే పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. 

మా పాలనలో మహిళలకు భద్రత లేదంటూ నిరసన ర్యాలీ చేస్తూ ఓ ప్రముఖ మహిళ (నయనతార) గురించి ఇంత చులకనగా మాట్లాడుతారా? మహిళల పట్ల మీకు ఎంత చులకనభావం ఉందొ మీ మాటలే చెప్తున్నాయి. తక్షణమే నయనతారకు, మహిళలకు క్షమాపణ చెప్పాలి,” అని డీఎంకే నేతలు డిమాండ్ చేశారు. 


Related Post