భద్రాచలం శ్రీరామ నవమి ఉత్సవాలకు సిఎం రేవంత్‌ రెడ్డి

March 17, 2026


img

తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులు రాష్ట్రంలో భద్రాచలం, వేములవాడ పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి భయపడుతుంటారు. వాటిలో అడుగుపెడితే పదవీ, అధికారం కోల్పోతామనే భయపడుతుంటారు.

ఈ భయంతోనే కేసీఆర్‌ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు. కానీ సిఎం రేవంత్‌ రెడ్డికి ఇలాంటి పట్టింపులు, మూడ నమ్మకాలు లేవు. కనుక తాను తప్పకుండా  భద్రాచలం, వేములవాడ రెండు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని స్వామివారి మొక్కులు తీర్చుకుంటానని చెప్పారు. 

భద్రాచలంలో ఈ నెల 19న ఉగాది నుంచి శ్రీరామ నవమి వేడుకలు మొదలవుతాయి. ఈ నెల 27న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆ మర్నాడు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

ఈ వేడుకలకు సిఎం రేవంత్‌ రెడ్డి హాజరు కాబోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ తెలియజేసింది. సిఎం పర్యటన సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ తెలియజేసింది.

సిఎం రేవంత్‌ రెడ్డి హామీ నిలబెట్టుకుంటూ భద్రాచలం అలాయాభివృద్ధికి 300 కోట్లు కేటాయించారు. ఈ నెల 27న భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు వంద కోట్ల విలువైన పనులకు సిఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. 



Related Post