ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేస్తున్న ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ఇటీవల విడుదలైన ‘సంచారమే…’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి సోషల్ మీడియాలో మంచి వ్యూస్ వస్తున్నాయి. వారం రోజులో సుమారు 4 లక్షల మంది ఈ సాంగ్ చూశారు. గోరేటి వెంకన్న వ్రాసిన ఈ పాటని హేషం అబ్దుల్ వాహేబ్ స్వరపరిచి ఆయనతో కలిసి అద్భుతంగా పాడటమే ఇందుకు కారణం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: అజీం మొహమ్మద్, కోరియోగ్రఫీ: లీలావతి, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.