ప్రముఖ గాయని మంగ్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ద్రువ్ సర్జా హీరోగా నటించిన కన్నడ సినిమా కేడీ: ది డెవిల్. పాన్ ఇండియా మూవీగా హిందీలో కూడా విడుదలవుతోంది. ఈ సినిమా కోసం ఆమె పాడిన హిందీ పాట సర్కే చునార్ తేరి సర్కే పాట వివాదస్పదమవడంతో దర్శక నిర్మాతలు ఆ పాటని ఉపసంహరించుకొని దాని లిరిక్స్ మార్పు చేస్తున్నారు.
ఈ పాటని పాడిన మంగ్లీ స్పందిస్తూ, “అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మేమందరం చాలా చింతిస్తున్నాము. ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశ్యం మాకు లేదు. కానీ ఈ పాట వలన కొందరికి బాధ కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. వెంటనే ఈ పాటని యూట్యూబ్‌తో సహా అన్నిటి నుంచి తొలగిస్తున్నాము. దానిలో ఇబ్బందికరంగా ఉన్న లిరిక్స్ తొలగించి మళ్ళీ కొత్తగా రూపొందించి అందిస్తాము,” అని సోషల్ మీడియాలో ఓ సందేశం పెట్టారు.
సినిమా దర్శక నిర్మాతలు ఇలాంటి అశ్లీలమైన పాటలు కోరితే, గీత రచయితలు వ్రాయడానికి వెనకాడరు. వాటిని పాడేందుకు ఎవరూ వెనకాడరు. అలాగే ఇలాంటి పాటలకు డాన్స్ చేయడానికి నటీనటులు వెనకాడరు. కనుక ఎవరిని తప్పు పట్టాలి? ఇలాంటి పాటలు తీస్తున్నవాళ్ళనా లేక వాటిని చూస్తున్న వాళ్ళనా?