హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం... 20 ని.లు బ్రేక్

March 20, 2026
img

శుక్రవారం ఉదయం నాగోల్-రాయదుర్గం మార్గంలో హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సుమారు 20 నిమిషాలపాటు జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్ వద్ద మెట్రో రైళ్ళు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. మంచి రద్దీ సమయంలో మెట్రో రైళ్ళు మద్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురయ్యారు. వెంటనే మెట్రో సిబ్బంది లోపాన్ని గుర్తించి సరిచేయడంతో మళ్ళీ యధా ప్రకారం మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. 


Related Post