చిరంజీవిపై 'పక్క రాష్ట్రం' ట్రోలింగ్‌ షురూ!

March 20, 2026
img

హైదరాబాద్‌లో నిన్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, అవార్డుల ప్రధానం విషయంలో పక్క రాష్ట్రం తెలంగాణ కంటే చాలా వెనకబడిపోయింది. కనుక ఇకనైనా సినీ అవార్డులు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడుగారికి విజ్ఞప్తి చేశారు. 

చిరంజీవి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. ఏపీలో పుట్టి పెరిగి ఈ స్థాయికి చేరిన అయనకు ఏపీలో లక్షల మంది వీరాభిమానులున్నారు. అలాంటి చిరంజీవి తన స్వరాష్ట్రాన్ని ‘పక్క రాష్ట్రం’ అని సంభోదించడం, అవార్డుల విషయంలో తెలంగాణ కంటే వెనకబడిపోయిందని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ఆంధ్రాకు చెందినవారు భగ్గుమంటున్నారు. తనని ఆదరించి ఈ స్థాయికి చేర్చిన ఆంధ్రాని ‘పక్క రాష్ట్రం’ అని సంభోదిస్తారా? అని కొందరు భగ్గుమంటున్నారు. 

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం స్వయాన్న ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌ ఆహ్వానిస్తున్నా ఏపీకి సినీ పరిశ్రమని విస్తరించడానికి ఇష్టపడని మీకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఎందుకు ఇవ్వాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు టికెట్స్ రేట్స్ పెంచుకోవాల్సినప్పుడు మాత్రమే మీ అందరికీ ఏపీ ప్రభుత్వం గుర్తొస్తుంది లేకుంటే లేదు. అందుకే మీకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఉదారంగా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిస్తూనే ఉంది కదా? అందుకే మీకు అలుసు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై చిరంజీవి ఇంకా స్పందించాల్సి ఉంది.                


Related Post