కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్

March 20, 2026


img

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ 15వ సినిమాగా ‘కొరియన్ కనకరాజు’ చేస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ  సినిమాలో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేశారు. 

ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జంటగా రితికా నాయక్ నటిస్తుండగా సత్య ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. త్వరలో  దక్షిణ కొరియాలో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. దీనిలో హీరో హీరోయిన్ల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తారు.   

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ధమన్‌ సంగీతం అందిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష