యూట్యూబర్ వైష్ణవి హత్య ఒక విషాదమనుకుంటే, అంత కంటే విషాదం కలిగిస్తోంది ఆమె అన్న సంతోష్ కుమిలిపోతున్న తీరు. వైష్ణవి అంత్యక్రియలు పూర్తయ్యి నేటికి మూడు రోజులు. అయినా అతను చెల్లి సమాధి వద్దనే కూర్చొని ఏడుస్తున్నాడు. అక్కడే నిద్రపోతున్నాడు.
తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అంతే. ప్రతీరోజూ వారు ఆమెకు ఇష్టమైన ఆహార పదార్ధాలు వండి తీసుకువస్తుంటే, సంతోష్ వాటిని చెల్లి సమాధి వద్ద పెట్టి, “చెల్లీ వచ్చి తిను... అమ్మ నీకిష్టమైనవన్నీ వండి తెచ్చింది,” అంటూ పిలుస్తున్నాడు. ఆమె చనిపోయిందని, తిరిగి రాదనీ తెలిసినా వారు ఆమె కోసం పడుతున్న బాధ చూసి గ్రామస్తులు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఆమె భర్త చిత్తరి హరిబాబు హత్య చేశాడు. పోలీసులు ఆతనితో సహా అతని తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి అశోక్‌లపై గురువారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వైష్ణవి భర్తని ఉరి తీయలంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు గురువారం కోరుట్ల బస్టాండ్ వద్ద కాసేపు ధర్నా చేశారు.
3 రోజులుగా చనిపోయిన సోదరి సమాధి వద్ద కన్నీరు కారుస్తున్న సోదరుడు
యూట్యూబర్ వైష్ణవి మరణాన్ని జీర్ణించుకోలేక విలవిలలాడుతున్న కుటుంబ సభ్యులు
వైష్ణవి సమాధిని పూలతో అలంకరించి ఆమెకు ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి లేపుతున్న అన్నయ్య సంతోష్
అందరి చేత కంట తడి పెట్టిస్తున్న దృశ్యం… pic.twitter.com/RhwJ1HQ5b8