రెండు వారాలకు పైగా సాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం వలన చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో, దేశీయ చమురు కంపెనీలు ఇటీవలే భారత్‌లో గృహ మరియు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి.
తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకి రూ.2.35 చొప్పున పెంచుతున్నట్లు హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ ప్రకటించింది.
ఒక కంపెనీ పెంచితే అన్ని కంపెనీలు వరుసగా పెంచడం ఖాయం. ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని ప్రకటించినప్పటికీ ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంటే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకమానవు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేవని చెపుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరక్క దేశవ్యాప్తంగా పలు హోటల్స్, టిఫిన్స్ సెంటర్స్ మూతపడ్డాయి.
గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారం రోజులకి కూడా వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. దీంతో పలువురు గ్యాస్ సిలిండర్లు మోసుకొని గ్యాస్ ఏజన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ గ్యాస్ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళో ఎవరికీ తెలీని పరిస్థితి నెలకొంది.