సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో మూసీ ప్రాజెక్టులో ఇళ్ళన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలంటూ నాడు మాజీ సిఎం కేసీఆర్, మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటల రికార్డింగ్ వినిపిస్తే కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ సభ్యులు జవాబు చెప్పలేకపోయారు. కానీ బయటకు వచ్చి కేటీఆర్ నోటి దురుసుతో, దురహంకారంతో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి సన్నాసి, తీన్‌ఫుట్ గాడు, వానపాము అంటూ కేటీఆర్ చాలా చులకనగా మాట్లాడారు. తన తండ్రి కేసీఆర్ పట్ల గౌరవంగా మాట్లాడాలని సుద్దులు చెప్పే కేటీఆర్, తాను మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి నోటికి వచ్చినట్లు ఇలా మాట్లాడుతుంటారు.
చెల్లి కల్వకుంట్ల కవిత సందిస్తున్న ప్రశ్నలు, విమర్శలకు ధైర్యంగా జవాబు చెప్పలేని కేటీఆర్, సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ఈవిధంగా చెలరేగిపోవడం గొప్పా?
ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి ఇలా మాట్లాడగలగడం తన ధైర్యంగానో లేదా వాక్చాతుర్యంగానో కేటీఆర్ భావిస్తున్నట్లున్నారు. కానీ తాను మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలకు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో పట్టించుకోవడం లేదు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈవిధంగా నోటి దురుసుతో, దురహంకారంతో మాట్లాడినందుకే ప్రజలు కొర్రు కాల్చి వాత పెట్టారని గ్రహించినట్లు లేదు. ఎందుకంటే అందుకే ఓడిపోయామని అంగీకరించడం లేదు కనుక! కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఈ దురహంకారం కూడా ఓ ప్రధాన కారణం. కల్వకుంట్ల కవిత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కదా?
అయినా అపర చాణక్యుడని బీఆర్ఎస్ పార్టీ పొగుడుకుంటున్న కేసీఆర్‌ని ఎన్నికలలో ఓడించింది ఆ సన్నాసి, తీన్‌ఫుట్ గాడు, వానపామే కదా?
తన తండ్రినే ఓడించి ఫామ్‌హౌసులో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి చాణక్యం గుర్తించి, తదనుగుణంగా వ్యూహ రచనలు చేసుకోవాల్సిన కేటీఆర్, సిఎం రేవంత్ రెడ్డిని బహిరంగంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే అదే రాజకీయమనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఇక ఎవరూ కాపాడలేరు.
రేపోమాపో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందనే సోయి లేకుండా ఇలా రాజకీయ కాలక్షేపం చేస్తే ఎవరికీ నష్టం?
కాలం మనది కానప్పుడు తీన్ ఫుట్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా మాట్లాడుతాడు
ఆయన అధికారంలో ఉన్నాడు మైక్ కట్ కాబట్టి ఏదైనా వాగుతాడు - కేటీఆర్ pic.twitter.com/cSMRzZxzMA