మూసీ ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య శాసనసభలో బయటా హోరాహోరీగా యుద్ధాలు జరుగుతున్నాయి. మూసీ ప్రాజెక్టుకి లక్షన్నర కోట్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కమీషన్లు దండుకోవాలని పెద్ద కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి వారికి నిన్న శాసనసభలోనే చెంపదెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పారు. తన మాటలతో కాదు... ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఎం హోదాలో కేసీఆర్, మున్సిపల్ శాఖా మంత్రిగా కేటీఆర్ మూసీ ప్రాజెక్టు గురించి శాసనసభలో మాట్లాడిన మాటలతోనే.. ఆనాటి వీడియో రికార్డింగ్ నిన్న శాసనసభలో వినిపించి వారి నోళ్ళు మూయించారు.
నాడు కేసీఆర్, కేటీఆర్ ఏమన్నారంటే, “మూసీ బఫర్ జోనులో సుమారు 10,000కి పైగా ఇళ్ళున్నాయని, పోలీసు బందోబస్తు, జేసీబీలతో వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించాలని అన్నారు. అక్రమ కట్టడాలకు తావు లేదన్నారు.
వారిరువురి మాటలను శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి వినిపిస్తే కేటీఆర్, హరీష్ రావు జవాబు లేదు. “నాడు మీరు ఈవిధంగా మాట్లాడి ఇప్పుడు విరుద్దంగా ఎందుకు మాట్లాడుతున్నారు?నాడు మూసీ పరివాహక ప్రాంతంలో నిర్దాక్షిణ్యంగా ఇళ్ళు తొలగించాలని చెప్పి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు?
నాడు మీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఇళ్ళు తొలగించాలనుకుంది. కానీ మా ప్రభుత్వం నిర్వాసితులకు వేరే చోట ఇళ్ళు ఇచ్చి, పునరావాసం కల్పిస్తోంది. నష్టపోయినవారికి మూసీ ప్రాజెక్టులోనే ఉపాధి కల్పిస్తోంది. మీకు మాకు ఇదే తేడా,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా బీఆర్ఎస్ పార్టీని కడిగేశారు.

మూసీపై, అక్రమ కట్టడాలపై అధికారంలో ఉండగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన వీడియోలు చూపించి, దొరల దొంగబుద్ధిని ఎండగట్టిన సీఎం

దెబ్బకు మాడిపోయిన కేటీఆర్, హరీష్ మొఖాలు pic.twitter.com/08bN69IFGB
— Aapanna Hastham (@AapannaHastham) March 18, 2026