బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ నుంచి మొదట ‘చికిరి చికిరి’, తర్వాత రయ్ రయ్ రా రా పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాటని సిద్ధం చేస్తున్నారు. ఇది ఐటెం సాంగ్. మృణాల్ ఠాకూర్ ఈ పాటకు డాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు జాన్వీ కపూర్ కూడా చేయబోతున్నారట! బుచ్చిబాబు ఇంకా ద్రువీకరించక మునుపే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం పెద్ది చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏప్రిల్ 30న పెద్దిని ప్రేక్షకుల ముందుకు తెస్తామని బుచ్చిబాబు హామీ ఇచ్చినందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చక్కబెట్టేస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.