ఇరాన్‌కి ట్రంప్‌ ఆఖరి హెచ్చరిక

March 22, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కి ఆఖరి హెచ్చరిక చేశారు. శనివారం సాయంత్రం నుంచి 48 గంటలలోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే మీ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తాము. ముందుగా అతిపెద్ద విద్యుత్ కేంద్రంతోనే మొదలుపెడతాము,” అని హెచ్చరించారు. 

ఇరాన్‌ అధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా భారీగా యుద్ధనౌకలు, సముద్ర గర్భంలో ప్రేలుడు పదార్ధాలను తొలగించే ప్రత్యేక యంత్రాలను పంపించారు. యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.  అయినా హర్మూజ్ జలసంధిని తెరవలేకపోయారు. తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయారని ఈ బెదిరింపులతో స్పష్టమవుతోంది. ట్రంప్‌ బెదిరింపులకు ఇరాన్‌ ఏవిధంగా స్పందిస్తుందో? ఎందుకంటే విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే దేశంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయి కనుక!


Related Post