శంభాల దర్శక నిర్మాతలు మరో సినిమాకి రెడీ

March 21, 2026


img

ఆది సాయి కుమార్ హీరోగా గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయిన 'శంబాల' సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన యుగంధర్ ముని, నిర్మించిన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు మళ్ళీ మరోమారు తమ షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3 తీసేందుకు చేతులు కలిపారు.

ఈరోజు ఈ సినిమాని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఓ తోడేలు సింహం ఎదురెదురుగా కోపంగా చూస్తున్న పోస్టర్ పెట్టి ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొందరు రాజులు ఎన్నటికీ చనిపోరు’ అని క్యాప్షన్ పెట్టారు.

ఈ సోషియో ఫ్యాంటసీ మూవీగా తెలుగు, తమిళ్, హిందీలో నిర్మించబోతున్నారు. . దీనిలో ప్రముఖ కన్నడ నటుడు సందీప్ కిషన్ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష