మాజీ ఐటి మంత్రి కేటీఆర్‌ ధర్మ సందేహం

March 21, 2026


img

తెలంగాణ మాజీ ఐటి మంత్రి కేటీఆర్‌కి ఓ ధర్మ సందేహం వచ్చింది. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటి ఉద్యోగాల సంఖ్య  9.46 లక్షలున్నాయి. కానీ మూడేళ్ళు తిరిగేసరికి ఉద్యోగాల సంఖ్య 9.39 లక్షలని మొన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అంటే 7,000 తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా? ఎందువల్ల? ఏఐ వల్లనా లేక అసమర్ధ కాంగ్రెస్‌ పాలన వలనా? అని శాసనసభలో ప్రశ్నించారు.  

ఐటి ఎగుమతుల విషయంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వాన్ని సూటిగా ఓ ప్రశ్న అడిగారు. “ఇటీవల మీ ఐటి మంత్రిగారు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రూ.3.60 లక్షల కోట్లు విలువగల ఐటి ఎగుమతులు జరిగాయని చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగంలో రూ. 3.13 లక్షల కోట్లు అని చెప్పారు. వీటిలో ఎవరు చెప్పింది నిజం? శాసనసభలో గవర్నర్‌ చెప్పింది నిజమా లేదా మంత్రిగారు  బయట మీడియాకు చెప్పింది నిజమా?” అని అడిగారు.


Related Post