బ్యాండ్ మేళం ట్రైలర్‌ చూశారా?

March 21, 2026


img

తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో వస్తున్న మరో చక్కటి రొమాంటిక్ కామెడీ సినిమా ‘బ్యాండ్‌ మేళం.’ ‘కోర్ట్-వర్సస్ నో బడీ’ వంటి సీరియస్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి మళ్ళీ ఈ సినిమాలో జంటగా నటించారు.   

ఈ నెల 26న బ్యాండ్ మేళం బ్యాచ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కనుక ముందుగా ట్రైలర్‌ చూపించారు. ట్రైలర్‌లో కామెడీ బాగుంది. కనుక సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.    

ఈ సినిమాకి కధ, ఎడిటింగ్,  స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేశారు. 

సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కాబోతోంది.          


Related Post

సినిమా స‌మీక్ష