శర్వా బైకర్ ట్రైలర్‌… డా.రాజశేఖర్ కూడా!

March 22, 2026


img

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం శర్వానంద్, మాళవిక నాయర్‌ ప్రధానపాత్రలలో ‘బైకర్’ ఏప్రిల్‌ 3న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున అదివారం ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌లో డా.రాజశేఖర్‌ శర్వా తండ్రిగా నటిస్తున్నారనే కొత్త విషయం బయటపెట్టారు.    

బైక్ రేసింగ్ కాన్సెప్ట్ తో ఇంతవరకు సినిమాలు రాలేదు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా బైక్ రేసింగ్ గురించే అయినప్పటికీ తండ్రీ కొడుకుల మద్య ఘర్షణ, భావోద్వేగాలు కూడా చాలా బలంగా ఉన్నాయని ట్రైలర్‌ చెప్పేసింది. కనుక ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు ఇంకా పెంచింది.      

 దీనిపై భారీ అంచనాలు ఉన్నందునే ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు బైకర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.27 కోట్లు చెల్లించి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.         

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు. ఏప్రిల్‌ 3న బైకర్ విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/aIhYSFGLE9g?si=s3VkGuKZF_JzIsCO" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష