ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మణికొండ పరిసర ప్రాంతాలలో భారీగా వడగళ్ళ వాన కురిసింది. ఎప్పటిలాగే యూసఫ్‌గూడా, శ్రీకృష్ణా నగర్, బేగం బజార్, కోఠీ, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాలలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్ళకు వచ్చే సమయంలో హటాత్తుగా భారీ వర్షం కురవడంతో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌తో సహా నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ పక్క భారీ వర్షం, ఆ వర్షంలో ట్రాఫిక్ జామ్, రోడ్లు కనబడకుండా మోకాలి లోతు నిలిచిన నీళ్ళు... ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.