గ్యాస్ సిలిండర్ సైజు, గ్యాస్ తగ్గబోతోంది: కేటీఆర్‌

March 24, 2026

img

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు ఓ సంచలన విషయం బయటపెట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మాకు లభించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు (మే4) వెలువడిన తర్వాత గ్యాస్ సిలిండర్ సైజు, దాంతో బాటే గ్యాస్ పరిమాణం కూడా తగ్గించబోతోంది. గ్యాస్ తగ్గించి అదే ధరకు గ్యాస్ విక్రయించబోతున్నట్లు సమాచారం. ఇది నిజమా కాదా? కేంద్ర ప్రభుత్వం చెప్పాలి.

అక్కడ ఢిల్లీలో మోడీ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండూ కూడా సామాన్య ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూనే ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని చెపుతుంటారు. కానీ గ్యాస్ సిలిండర్లు మాత్రం దొరకవు. ఎందువల్ల?

ఇంట్లో నా భార్య కూడా గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా? అని అడుగుతోంది. మా పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అబద్దాలు చెప్పడం మానుకొని తక్షణమే గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తేవాలి,” అని కేటీఆర్‌ అన్నారు.

ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ల స్థానంలో చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. ముందుగా దేశంలో వాడకంలో ఉన్న లక్షల సిలిండర్లు వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ మార్పు చేయడం చాలా కష్టం. ఒకవేళ చేయదలిస్తే దశలవారీగా చేయగలదేమో కానీ మే4 తర్వాత ఒకేసారి చేయడం అసాధ్యం. కనుక ఫలితాలు వెలువడిన వేటంటే పెట్రోల్, డీజిల్ ధరలు, వాటితో పాటు మళ్ళీ గ్యాస్ ధరలు పెంచే అవకాశాలే ఎక్కువ.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతుంది. ఇది మాకున్న విశ్వసనీయ సమాచారం.

- కేటీఆర్ pic.twitter.com/sbBs9EBiGt
— Telugu360 (@Telugu360) March 24, 2026

video source: Telugu 360

Related Post