హర్షిత రెడ్డి, స్మేహ మనిమేగలై జంటగా చేస్తున్న ‘దీవానా’ నుంచి ఇది ప్రేమ అంటూ మృదుమధురంగా సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. చైతన్య పింగళితో కలిసి ఈశ్వర్ చంద్ వ్రాసిన ఈ పాటని స్వరపరిచి సంగీతం అందించింది కూడా ఈశ్వర్ చంద్. కార్తీక్ గొంతులో ఈ పాట అద్భుతంగా వచ్చింది.
గీతా ఆర్ట్స్, అర్హ మీడియా బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి, సంగీతం:ఈశ్వర్ చంద్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ఎడిటింగ్:హృషికేశ్ పస్పాల్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.