కొడంగల్‌లో విద్యార్ధినితో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన

March 26, 2026
img

గురు-శిష్యుల బంధం ఎంతో పవిత్రమైనది. అలాంటి బంధానికి కళంకం తెస్తుంటారు కొందరు ఉపాధ్యాయులు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ సంఘటనని ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు బయటకు పొక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం ఆలస్యంగా మీడియా చేతికి చిక్కింది.

ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు బాలికని కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకున్నాడు. ఆ గదిలో సీసీ కెమెరా ఉందనే విషయం మరిచిపోయి తలుపు వద్దకు వెళ్ళి అక్కడికి ఎవరూ రావడం లేదని నిర్ధారించుకొని బాలికని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఏమీ జరగనట్లు తన కుర్చీలో కూర్చుని పనిచేసుకుంటున్నట్లు నటించాడు.

కానీ సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యం ఎలాగో బయటకు లీక్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యాశాఖ కూడా సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నారు. పైగా కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం. కనుక ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఉపాధ్యాయుడి అరాచకం..విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన

కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన స్వామి అనే ఉపాధ్యాయుడు

ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు పాల్పడిన ఉపాధ్యాయుడు… pic.twitter.com/NU3s5jwPQ3
— ChotaNews App (@ChotaNewsApp) March 26, 2026

video source: Chota News app

Related Post