నేడు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని బాల రామాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రంగు రంగు విద్యుదీపాలు, పువ్వులతో ఆలయాన్ని స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బాల రాముడిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు వారందరికీ ఓ అపూర్వ దృశ్యం చూసే భాగ్యం కలిగింది.
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు తాకాయి. ఆ కాంతికి నుదుటన వజ్రాల నామాలు ధగధగ మెరిసాయి. ఈ దృశ్యం కళ్ళకు కట్టినట్లు చూసేందుకుగాను ఆ సమయంలో ఆలయంలో లైట్లు అన్ని ఆర్పేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధాని మోడీ సైతం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ అద్భుత దృశ్యం చూసి పులకించిపోయారు. తన జన్మ ధన్యమైందన్నారు. దూరదర్శన్‌లో ప్రసారం అయిన ఈ వీడియోని మీరు చూసి తరించండి.
అయోధ్యలో సూర్య తిలకం అద్భుతం
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు సందర్భంగా మధ్యాహ్నం 12కి బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం దర్శనం అయింది
ప్రధాని @narendramodi కూడా ఢిల్లీ నుంచి లైవ్లో ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించారు#Ayodhya #RamaNavami #RamMandir #JaiShriRam
(📷:DD News) pic.twitter.com/fWMj2Bd4kh