తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భర్త దేవనపల్లి అనిల్‌తో కలిసి నిజామాబాద్‌లోని శ్రీరఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు ఆమె సిద్ధిపేటలో తన కొత్త పార్టీని ప్రకటించి, జెండా, అజెండా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ముందుగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. మరికొద్ది సేపటిలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.